కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ కార్యకర్తలే పట్టుకొమ్మలం

– రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి కోసం కృషి చేద్దాం
– కష్టపడ్డ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది
– జుక్కల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ రివ్వు మీటింగులో జిల్లా నాయకులు
నవతెలంగాణ- మద్నూర్
కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పట్టుకొమ్మలం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పట్టుదలతో కృషి చేద్దాం కష్టపడ్డ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది. కలిసికట్టుగా పని చేద్దాం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువద్దాం అంటూ యువజన కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి నాయకులు అలాగే జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జు పటేల్ యువ నాయకులు అరవింద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు జుక్కల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ రివ్వు మీటింగు మద్నూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ భవనంలో శనివారం నిర్వహించారు జిల్లా ఇన్చార్జిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా యోజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జు పటేల్ అధ్యక్షతన ఈ మీటింగు నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ డోంగ్లి బిచ్కుంద జుక్కల్ పెద్ద కోటప్పూగల్ పిట్లం నిజాంసాగర్ ఏడు మండలాల నుండి ఆయా మండలాల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి నాయకులు జిల్లా అధ్యక్షులు రివ్యూ మీటింగ్ లో కార్యకర్తలకు అవగాహన కల్పించారు రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ కాంపిటీషన్ పై అవగాహన కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే పట్టుకొమ్మలని పార్టీ అభ్యర్థుల గెలుపుకు యువకులు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి యువకులమంతా కలిసికట్టుగా కృషి చేద్దామని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు భగవాన్ మండల పార్టీ అధ్యక్షులు వట్నాల రమేష్ సీనియర్ నాయకులు, గంపల గంగాధర్ ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యకర్తల సమావేశానికి భోజన ఏర్పాటు చేశారు.