– పనులు పరిశీలించిన మున్సిపల్
– చైర్‌పర్సన్ కోలన్ సుష్మ, వైస్ చైర్మన్ బండి గోపాల్
నవతెలంగాణ-శంషాబాద్
మున్సిపాలిటీ పరిధిలోని చిన్న గొల్లపల్లిలో రూ.22 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులతో చేపట్టిన సీసీరోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ కే.సుష్మ మహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్‌యాదవ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. రోడ్డు నిర్మాణం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని భ విష్యత్తు తరాలు వాటినే వినియోగించుకునేలా నిర్మాణం జరగాలని కాంట్రా క్టర్, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చెన్నం అశోక్ , వర్క్‌ఇన్స్‌స్పెక్టర్ అబ్బాస్, తదితరులు పాల్గొన్నారు.