నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మత్స్య శాఖలోని ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (మెపా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులిదేవేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2017 లో ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి ప్రతిభ ఆధారంగా వీరిని నియమించిందని తెలిపారు. ఆ ప్రకారంంగా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రతి యేటా వారు అడుగుతున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారిని వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.