యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాల్సిందే..

– తే.యూ పి.డి.ఎస్.యూ..
నవతెలంగాణ -డిచ్ పల్లి:
అన్ని యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన దీక్షకు యూనివర్సిటీ పి.డి.ఎస్.యూ కమిటీ మద్దతు తెలిపి అధ్యపకులతో యూనివర్సిటీ మెయిన్ గెట్ ముందు అభివాదం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీ లలో అనేక సంవత్సరాలుగా చాలీచాలని జీతం తో  ఉద్యోగాలు చేస్తున్నారని, కాంట్రాక్టు అధ్యపకులకు ఉద్యోగ భద్రత లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు లక్షల్లో జీతాలు  పెంచుకున్నారని , అనేక సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, యూనివర్సిటీలో పని చేసే అధ్యాపకులను పట్టించుకోకపోవడం సరైంది కాదని,
సీఎం కేసీఆర్ హామీ మేరకు అన్ని యూనివర్సిటీల కాంట్రాక్ట్   అధ్యాపకుల రెగ్యులర్ చేయాలని మరియు అడ్మినిస్ట్రేటివ్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ యూనివర్సిటీ నాయకులు  సునీల్, శివ సాయి, రవీందర్ , ఆకాష్ మరియు కాంట్రాక్ట్ అధ్యాపకులు డా. దత్త హరి ,నేత, కిషన్, శ్రీనివాస్, కిరణ్, స్వామి, తదితరులు పాల్గొన్నారు.