గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలి

తాండూరు ఎంపీపీ అనితా రవీందర్‌ గౌడ్‌
దశాబ్ద్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలా కొనసాగించాలి
నవతెలంగాణ-తాండూర్‌ రూరల్‌
అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని తాండూరు ఎంపీపీ అనిత రవీందర్‌ గౌడ్‌ అన్నారు. బుధవారం ఎంపీపీ అధ్యక్షతన తాండూర్‌ మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం పీపీ మాట్లాడుతూ. గ్రామాల అభివృద్ధికి అధికారులు ప్ర జాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలా కొనసాగిం చాలని ప్రభుత్వం నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం ఉత్స వాలకు శ్రీకారం చుట్టాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌ సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయ లను కేటాయించి అభివృద్ధి కోసం విడతల వారీగా మం జూరు చేస్తుందన్నారు. క్రీడా ప్రాంగణాల బిల్లుల చెల్లింపు విషయంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తూ బిల్లులు చెల్లిం చారని ఒక పంచాయతీలో రూ.50 వేలు చెల్లిస్తే మరో పం చాయతీలో రూ.34 వేల మాత్రమే చెల్లించడం ఏంటం టూ గుంత బాచుపల్లి గ్రామ సర్పంచ్‌ జగదీష్‌ వివరణ ఇవ్వాలన్నారు. అధికారులు పెట్టిన పెట్టుబడి కంటే రూ 30 వేలు బిల్లు తగ్గించడం ఏంటని మండిపడడంతో మరో మారు ఎంబి చూసి రికార్డు చేయడం జరుగుతుందని హా మీ ఇవ్వడంతో ఆ సమస్య సద్దుమలిగింది. గ్రామాల్లో ప నులు పెండింగ్లో ఉంటున్నాయని అలా కాకుండా సమ న్వయంతో సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వే యాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మంజుల వెంకటే శం, పిఎసిహెచ్‌ చైర్మన్‌ రవీందర్‌ గౌడ్‌, డిప్యూటీ తహసీ ల్దార్‌ ధనుంజయ ఎంపీడీవో సుదర్శన్‌ రెడ్డి, ఏపిఎం ఆనంద్‌ పంచాయత్‌ రాజ్‌ ఏఈ సంతోష్‌ ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈ సాయి ప్రణీత్‌ కో ఆప్షన్‌ సభ్యులు శంషుద్దీన్‌ వివిధ శాఖల అధికారులు సర్పంచ్‌ ఎంపీటీసీలు పాల్గొన్నారు.