పత్తి రైతుల పాట్లు…అప్పులతో అగచాట్లు

– ఏడాది నుండి పలకని మద్దతు ధర
– ధర లేక ఇళ్ల లోనే పత్తి నిల్వలు
నవతెలంగాణ – ఎర్రుపాలెం
వాతావరణ మార్పుల వలన ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు ఆశించిన మేర పంటలు దిగుబడి లేవని, పండిన పంటకు మద్దతు ధర ప్రభుత్వాలు కల్పిస్తే తప్ప రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. ఎర్రుపాలెం మండలంలో సుమారు 9,250 ఎకరాలలో పత్తి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి విజయ భాస్కర్‌రెడ్డిని పత్తి పంట సాగుపై సంప్రదించగా పురుగు ఉధృతిని మందుల పిచికారితో నివారించగలిగితే ప్రతి సంవత్సరం వలె ఎనిమిది నుండి పది క్వింటాళ్ల వరకు పత్తి వస్తుందని అని తెలిపారు. గత ఏడాది కాలంగా పత్తి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి అసలు, వడ్డీలు తీర్చ లేక అల్లాడి పోతున్నామని పత్తి రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం పత్తి పంట చేతికి వచ్చిన తొలి నాళ్లలో వ్యాపారులు 8 వేలకు పైగా కొనుగోలు చేశారు. మరోక వారం పది రోజులలో తొమ్మిది నుంచి పది వేల రూపాయలకు చేరుకుంటుందని రైతులందరూ మద్దతు ధర కోసం ఆశ పడి పత్తిని నిలువచేశారు. ధర పెరుగుతుంది కదా అనుకున్న సమయంలో రోజు రోజుకు ధర తగ్గుతూ చివరకు 6,000 వేల నుంచి 7,000 వేల రూపాయల మధ్య లో నిలిచి పోవడంతో ఎక్కడి కొనుగోళ్లు అక్కడే నిలిచి పోయాయి.పెట్టుబడులు పెట్టి ఇబ్బందులు ఉన్నవాళ్లు కుటుంబాలు ఖర్చులు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు తప్పని సరి అయిన వాళ్ళు మద్దతు ధర లేక పోయినా వ్యాపారి చెప్పిన ధరకు నిలువునా అమ్ముకొని అప్పుల పాలయ్యారు. ప్రతి ఏడాది పెట్టు బడులు పెరుగుతున్న దశలో గిట్టుబాటు ధర వస్తుందని ఆశతో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. కౌలు రైతులు ఎకరానికి 15 వేల నుంచి పాతిక వేల రూపాయల వరకు ముందుగానే కౌలు చెల్లించి పొలాలు సాగు చేస్తున్నారు. పత్తి విత్తనాలు, అరక కూలీ, కలుపు తీత, సాగు నీరు, మోటార్‌ కరెంటు ఖర్చు, ఎరువులు, పై మందులు, పత్తి తీత, పంట ఇంటికి చేరే వరకు ఒక్కో ఎకరానికి సుమారు కౌలు రైతుకి 70,000 వేలు సొంత భూమి ఉన్న రైతుకి 50,000 వేల రూపాయల పైగా పెట్టుబడి కోసం ఖర్చు చేస్తున్నారు. ఒక్కో ఎకరానికి సుమారు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చి 12 నుంచి 15 వేల రూపాయల మద్దతు ధర పలికితే పర్వాలేదు. తొలి దశలో తీసిన పత్తి తేమ శాతం కాయ శాతం ఉందనే సాకుతో నాలుగు నుంచి ఐదు వేల రూపాయల మధ్యలోనే వ్యాపారులు అడ్డంగా కొనుగోలు చేస్తారు. ఒక వేళ రైతు ఆ పత్తిని నిల్వ చేద్దాం అనుకున్న తేమ శాతం ఎక్కువగా ఉండి పది రోజులలోనే వేడెక్కి రంగు మారి పోతుంది. మళ్లీ రంగు మారితే ధర తగ్గుతుందేమోననే భయంతో వ్యాపారి చెప్పిన ధరకే రైతులు తప్పనిసరి పరిస్థితిలో పత్తిని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడు తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బీటీ విత్తనాలు రాక పూర్వం పత్తి సాగు ఏప్రిల్‌, మే నెల వరకు పంట చేతికి వచ్చేది ఇప్పుడు మార్కెట్లో బీటీ విత్తనాల రాకతో నవంబర్‌ చివరలోనే పత్తి పంట పూర్తిగా క్షీణించి పోతుంది. కేవలం అక్టోబర్‌, నవంబర్‌ నెలలో మూడు దఫాలుగా పంట చేతికి వస్తుంది, మొదటి సారి పత్తి తేమ శాతం పేరుతో అడ్డగోలు గా కొనుగోళ్లు చేస్తే రెండు మూడవ సారి పత్తిని వ్యాపారులు నలక పుచ్చు పేరుతో ఉన్న ధర కంటే క్వింటాళ్లకు వెయ్యి రెండు వేలు తగ్గించి కొంటున్నారు.దీంతో పత్తి రైతుకి మూడు దఫాలుగా తీసే పత్తిలో ఒక్కసారి కూడా సరైన మద్దతు ధర దక్కటం లేదని ఆగ్రహిస్తున్నారు. అసలు ధర పేపరు ప్రకటనలోనే తప్ప రైతు చేతికి అందడం లేదు. ఏడాది కాలం గా పత్తి రైతులు మద్దతు ధర కోసం ఇళ్ల లోని పత్తిని నిలువ చేసుకొని ఉన్నారు. మద్దతు ధర సంగతి పక్కన పెడితే ఏడాది కాలం గా పత్తి తరుగు పోయి రంగు మారిపోయి కొన్ని చోట్ల సరియైన రక్షణ లేక ఎలుకలు పందికొక్కులు పశువులకు ఆహారంగా మారి ఎక్కడ పత్తి అక్కడే అమ్మకానికి పనికి రాకుండా నాణ్యత పూర్తిగా కోల్పోయిందని రైతులు తెలిపారు. గత ఏడాది మద్దతు ధర దెబ్బ తీయగా ఈ ఏడాది ఆ ది నుండి అగ చాట్ల తోనే పత్తి పంట సాగుతోంది గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది తీవ్ర వర్షాభావ ప్రభావం నెలకొంది సరైన వర్ష పాతం లేక పోవడంతో ఒక్కో రైతు రెండుసార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది మొక్క మొ లచిన నాటి నుండి ఇప్పటి వరకు సరైన వర్షం లేక పో వడంతో మొక్క ఎదుగుదల లేక మోకాళ్ళ ఎత్తులోనే ఎదుగుదల ఆగిపోయింది, చెట్టు కాసిన నాలుగైదు కా యలు కూడా చెట్టుతో పాటు సరిగా పెరగక పోవడంతో ఈ ఏడాది ఒకటి రెండు సార్లు పత్తి తీస్తే పంట కా లం పూర్తయ్యే పరిస్థితి కనపడుతుందని రైతులు ఆవే దన చెందుతున్నారు.ఒక్కో ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్న ఆశ లేదని రైతులు వాపోతున్నా రు.ఈ సంవత్సరం సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు సా గుతాయని త్వరలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేస్తామని ప్రకటనలు రావడం తో రైతు ఇప్పటి దాకా పడిన బాధ ఒక ఎత్తు అయితే మద్దతు ధర కూడా 6,700కు మించి ఉండదని వార్తలు రావడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. సిసిఐ మద్దతు ధర 6,700 ప్రకటించినా రైతులకు చేతికి 5,000 మించి ధర దక్కదనే ప్రచారం సాగుతోంది. ఎలక్షన్‌ కోడ్‌ రావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కి పోతోంది అధికారులు ప్రజా ప్రతి నిధులు పూర్తిగా ఎన్నికలు రాజకీయ పార్టీల ప్రచారాల హడావుడిలో మునిగి పోయారు.దీంతో రైతుని రైతు మద్దతు ధరని పట్టించుకునే నాధుడే కరువైపోయారు. దీంతో పూర్తిగా పీకల లోతు అప్పుల బాధలలో కూరుకుపోయిన పత్తి రైతులకు ఆత్మ హత్యలు తప్ప వేరే దిక్కు లేదని మూగ రోధనను అనుభవిస్తున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని సిసిఐలు ద్వారా పత్తి రైతుకు కనీస మద్దతు ధర 12 నుంచి 15 వేల రూపాయల కల్పించకపోతే ఈ ఏడాది పత్తి రైతుల ఆత్మహత్యలు మొదలవుతాయని ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించి రై తులను ఆదు కోవాలని కోరుతున్నారు.