నేడు సీపీగెట్‌ ఫలితాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరంలో వివిధ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్‌ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీపీగెట్‌) ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు సీపీగెట్‌ కన్వీనర్‌ ఐ పాండురంగారెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, ఓయూ వీసీ డి రవీందర్‌ ఈ ఫలితాలను మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేస్తారని తెలిపారు. సీపీగెట్‌ పరీక్షలను జూన్‌ 30 నుంచి గతనెల 10 వరకు నిర్వహించామని పేర్కొన్నారు. 69,377 మంది దరఖాస్తు చేస్తే, 60,443 మంది పరీక్షలకు హాజరయ్యారని వివరించారు.