– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి కూనంనెనీ సాంబశివరావు గెలుపుకు సీపీఐ(ఎం) కార్యకర్తలు కృషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. బుధవారం స్థానిక మంచికంటి భవన్‌లో నియోజకవర్గ కన్వీనర్ కాసాని ఐలయ్య అధ్యక్షతన జరిగిన జనరల్ బాడి సమావేశంలో పోతినేని మాట్లాడుతూ కొత్తగూడెంలో రాజకీయ టూరిస్ట్ జలగం వెంకటరావు, అవకాశవాది వనమా వెంకటేశ్వరరావును ఓడించి ప్రజా స్వామిక వాది కూనంనేని సాంబశివరావును గెలిపించాలని పిలుపునిచ్చారు. వామపక్షాల అభ్యర్థులు అసెంబ్లీలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాడుతారని, ప్రజాస్వామ్య రక్షణకై నిలబడతారన్నారు. కమ్యూనిస్టులు లేని అసెంబ్లీలో ప్రజా సమస్యలు వెలుగులోకి రావని, ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్టులను గెలిపిస్తే ప్రజా గొంతుకగా పని చేస్తారన్నారు.
ప్రశ్నించే శక్తులను అసెంబ్లీకి పంపించండి… సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి కూనంనేని సాంబశివరావు
ప్రశ్నించే శక్తులను అసెంబ్లీకి పంపించాలని సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం నియోజక వర్గ అభివృద్ధికి వామపక్ష శక్తులను గెలిపించాలని పిలుపు నిచ్చారు. అవకాశవాద రాజకీయాలను ఓడించి స్వచ్చ రాజకీయాలను గెలిపించాలని పిలుపు నిచ్చారు. కొత్తగూడెం సీపీఐ తప్పక గెలుస్తుందని, అందుకు కమ్యూనిస్టుల సాగించిన పోరాటాలే నిదర్శనం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, కొక్కెరపాటి పుల్లయ్య, ఎం.జ్యోతి, నర్సారెడ్డి, లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్, దోడ్డా రవి, వీర్ల రమేష్, యు.నాగేశ్వరరావు, మందా నరసింహారావు, ఎంవి.అప్పారావు, నగేష్, వీరన్న, లక్ష్మి, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.