సీపీఐ(ఎం) అభ్యర్థి అర్జున్‌ను గెలిపించాలి

నవతెలంగాణ-ములకలపల్లి
సీపీఐ(ఎం) అశ్వారావుపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పిట్టల అర్జున్‌ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ములకలపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన, కార్మిక పోరాటాలను నడిపిస్తూ అనునిత్యం ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న అర్జున్‌ గెలుపు ద్వారా నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. అలాగే కమ్యూనిస్టుల్ని ఎన్నుకోవడం ద్వారా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పాటుపడతారని, ప్రజల అభివృద్ధికి సహకరిస్తారని చెప్పారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే కమ్యూనిస్టులను అలాగే పిట్టల అర్జునుని గెలిపించాలని కోరారు. కమ్యూనిస్టులు గెలుపుతో అవినీతి లేని ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, నాయకులు వూకంటి రవికుమార్‌, గోపగాని లక్ష్మీ నరసయ్య, రాజు, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.