సీఆర్‌టీ పోస్టులు

– గిరిజన అభ్యర్థులతోనే భర్తీచేయాలి
– తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సీఆర్‌టీ పోస్టులు గిరిజన అభ్యర్థులతోనే భర్తీచేయాలని తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్‌, ఆర్‌ శ్రీరాంనాయక్‌ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్స్‌ (సీఆర్‌టీ) పోస్టులను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఆయా పోస్టుల్లో స్థానిక గిరిజన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ విషయమై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ గతంలో ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ.. నాగర్‌ కర్నూల్‌ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో అందుకు విరుద్ధంగా స్థానిక అధికారులు భర్తీ చేస్తున్నారని తెలిపారు.