అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

నవతెలంగాణ-తలకొండపల్లి
ప్రభుత్వ ఉన్నత పాఠశాల తలకొండపల్లిలో గ్రామ సర్పంచ్‌ లలిత జ్యోతయ్య, ఎంపీడీఓ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ భగవాన్‌రెడ్డి నిర్వహించారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భగవాన్‌ రెడ్డి, శ్యామ్‌, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.