సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి

– భూక్య రాజు బిజెపి రాష్ట్ర పాలసీ అండ్ రీసెర్చ్ అధ్యక్షులు.
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రాచీన కాలం నుండి వస్తున్న మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బిజెపి రాష్ట్ర పాలసీ అండ్ రీసెర్చ్ అధ్యక్షులు బుఖ్య రాజు అన్నారు. గురువారం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మద్దినేని తేజ రాజు ఆధ్వర్యంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గ్రామదేవతలు భూదేవి శ్రీదేవి బొడ్రాయి ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలను మన తాతలు తండ్రుల కాలం నుండి నేటి వరకు కొనసాగడం మన ప్రాచీన సంప్రదాయాలను మనం కాపాడుకోవడం అని అన్నారు. అనంతరం లక్ష్మీపురం (నేతగాని గూడెం) బొడ్రాయి ప్రతిష్టాపన నిమిత్తం 5016/-తన వంతు విరాళంగా ఇచ్చారు.హిందూ సంస్కృతి సంప్రదాయాలను, ప్రతిబింబించే ఆనవాయుతిగా, గ్రామదేవతలను, మొట్టమొదటిగా మొక్కులు చెల్లించే దేవతగాను, గ్రామ ప్రజల ఆయు రారోగ్యాలతో పిల్లాపాపలతో , సుఖ,శాంతులతో , పాడిపంట సమృద్ధిగా సమకూర్చే దేవతగా అభివర్ణించారు. తర్వాత రామపట్నంలోని కొండపర్తి సదాశివాచారి దశదినకర్మకు హాజరై సగులం సాంబశివరావు కంఠం చంద్రశేఖర్ సంపత్ రవి సమక్షంలో పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు .కార్యక్రమంలో. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జినుకల కృష్ణాకర్ ,ములుగు అసెంబ్లీ కన్వీనర్ బలరాం , బీజేవైఎం అధ్యక్షులు కొత్త సురేందర్, మెరుగు సత్యనారాయణ ,కొత్త సుధాకర్ రెడ్డి ,శ్యామల శ్రీనివాస్, గాంధార్ల వెంకన్న గజ్జి కుమారు ,తోటరాజు, గాంధర్ల సత్యనారాయణ, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు రాఘవపట్నంలోని కొండపర్తి సదా శివాచారి ,దశదినకర్మకు, సగులం సాంబశివరావు, కంఠం చంద్రశేఖర్, సమక్షంలో హాజరై ఆర్థిక సహాయం చేశారు.సంపత్ రవి తదితరులు పాల్గొన్నారు .