అమెరికాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న దామోదర్‌ రావు

నవతెలంగాణ-మియాపూర్‌
అమెరికాలో జరిగిన అంతర్జాతీయ సదస్సు లో వేదాంతు ఐఐటీ అండ్‌ మెడికల్‌ అకాడమీ, మేనేజింగ్‌ డైరక్టర్‌, డాక్టర్‌ దామోదరరావు తాని కొండ పాల్గొన్నారు. జూన్‌ 1,2,3వ తేదీలలో అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్‌ కాన్సాస్‌, లా రెన్స్‌లో అంతర్జాతీయంగా సుప్రసిద్ధ యూనివర్సి టీలు కలిసి అంతర్జాతీయ సదస్సు నిర్వహిం చాయి. 21వ సెంచరీ విద్యార్థి విజయానికి కావాల్సిన నైపుణ్యాలు అన్న అంశంపై వేదాంతు ఐఐటీ అండ్‌ మెడికల్‌ అకాడమీ ఒక కేస్‌ స్టడీగా తీసుకొని పేపర్‌ ప్రజెంట్‌ చేశారు. ఈ అంతర్జా తీయ సదస్సులో ప్రపంచ నలు మూలల నుండి ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీలు పాల్గొన్నా యి. ఈ గొప్ప అవకాశం తెలంగాణ నుండి, వే దాంతు ఐఐటీ అండ్‌ మెడికల్‌ అకాడమీ మేనే జింగ్‌ డైరక్టర్‌నీ వరించడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. మారుతున్న కాలానుగుణంగా, విద్యా వ్యవస్థలో విద్యార్థుల జీవన శైలిలో సంతరించుకొన్న పలు మార్పులు, వారి మీద ప్రస్తుత సోషల్‌ మీడియా ప్రభావాన్ని అధిక మిస్తూ, ఒక విద్యార్థి తన జీవితంలో విద్యా పరమయియన్‌ సక్సెస్‌ను పొందాలంటే ఎలాంటి నైపుణ్యాలను అలవర్చుకోవాలి అన్న అంశం మీద సమగ్ర పరిశోధన జరిపి ఈ పేపర్‌ ప్రజెంట్‌ చేసినట్టు తెలిపారు.