గర్జించే కవిత్వం గర్వించే పాటలు దాశరథి, సినారెలు

– ఘనంగా దాశరథి, సినారె జయంతి వేడుకలు
నవతెలంగాణ-కొడంగల్‌
తెలంగాణ మహాకవులు డాక్టర్‌ దాశరథి కృష్ణ మాచార్య, డాక్టర్‌ సి.నారాయణరెడ్డిల జయంతిని పురస్కరించుకుని ఆదివారం అనంత సాహిత్య సం స్కృతి వేదిక కొడంగల్‌ విభాగం ఆధ్వర్యంలో ఆది వారం కొడంగల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కవి సమ్మేళనం, అష్టావధానం కార్యక్రమాల్లో కవులు, రచయితలు, సాహితీవేత్తలు పాల్గొని కవి సమ్మేళ నం, అష్టవదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డాక్టర్‌ జి.చెన్నకేశవరెడ్డి, పోలె విశ్వనాథం లు పాల్గొని వారు మాట్లాడుతూ తెలుగు పాటకు తేనే తాగించి.. తెలుగు వారి గుండెల్లో అనుభూతు ల జేగంట మోగించిన కవి రత్నాలలో దాశరథి కృష్ణ మాచార్యులు ఒకరు అన్నారు. కవిగా దాశరథిలో రెండు కోణాలు కనిపిస్తాయన్నారు. ఆనాటి నిజం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిడికిలి బిగించి, పద్యాన్ని ఆయుధంగా ప్రయోగించిన పరుశురాముడు ఆయ న అన్నారు. పడుచుదనంలోకి అడుగుపెట్టిన పాట కు ఊహల రెక్కలు తగిలించినవారాయన అన్నారు. ఒకవైపు విప్లవ కవిత్వం, మరోవైపున విరహంతో కూడిన పాటలను పలికించిన ప్రత్యేకత దాశరథి సొంతమన్నారు. తన కళాన్ని ఖడ్గంలో ఉపయోగిం చిన ఆయన ‘ఒర’లో గర్జించే కవిత్వం. గర్వించే పాటలు ఇమిడిపోయాయన్నారు. నిజం పాలకుల నియంతృత్వాన్ని నిరసిస్తూ.. తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛను ఆకాంక్షిస్తూ ఆయన ‘అగ్నిధార’ కురిపిం చారన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో పదునైన అక్షరాలతో పద్యాలు సంధించా రన్నారు, జైల్‌ గోడలపై బొగ్గుతో పద్యాలు.. నినాదా లు రాస్తూ తనదైన భావజాలాన్ని భయం లేకుండా బయట పెట్టారన్నారు. నా తెలంగాణ కోటి రత నాల వీణ అంటూ ఆయన చేసిన పోరాటం ఆయన కి కవి సింహం అని బిరుదును తెచ్చిపెట్టిందన్నారు. దాశరథి నుంచి విలువడిన ‘అగ్నిధారా’, రుద్రవీణ, ‘తిమిరంతో సమరం’ పునర్నవం కవితా సంపుటాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానంలో నిలి చాయన్నారు. దాశరథి తీవ్రమైన భావజాలంతో కవి తలు రాసినప్పటికీ, సున్నితమైన భావాలతో మన సులను మంత్రించే శక్తి కూడా ఆయనకి ఉందని విషయాన్ని చిత్ర పరిశ్రమకు పాటలు ద్వారా తెలిసిం దన్నారు. ఇద్దరు మిత్రులు సినిమా కోసం ఆయన రాసిన ఖుషి ఖుషిగా నవ్వుతూ అనే ఉషారైన పాట కూడా జనంలోకి దుసుకుపోయిందన్నారు. తెలం గాణ ప్రాంతం నుంచి మొట్టమొదటగా జ్ఞానపీఠ అవార్డు పొందిన జ్ఞాన యోధుడు సినారె అని కొని యాడారు. ప్రముఖ శతావధాని డాక్టర్‌ మలుగ అం జయ్య సమక్షంలో జరిగిన అష్టావధాన కార్యక్రమం లో ప్రృచ్చాకులు ప్రశ్నలకు అవధాని అంజయ్య సమాధానాలతో సభలోని వారు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కొడంగల్‌ మండల ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజారాం, అనంత సాహిత్య సంస్కృతిక వేదిక వ్యవ స్థాపకులు దొరవేటి చెన్నయ్య, గౌరవ అధ్యక్షులు బిపి నర్సిములు గుప్తా, ప్రధాన కార్యదర్శి ఆశీర్వా దం, తూర్పు మల్లారెడ్డి, గంట మనోహర్‌ రెడ్డి, తెలం గాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌ గౌడ్‌, కవులు, రచయితలు వడిచర్ల సత్యం, వెన్నెల సత్యం, మాసాని వెంకటయ్య, అంజిలప్ప, తెలుగు భాషాభిమానులు ఎర్రన్‌పల్లి శ్రీనివాస్‌, బత్తుల మల్లయ్య, పండారి, శిలాదేవి, పద్మా, మంజుల తదితరులు పాల్గొన్నారు.