నవతెలంగాణ-కంటేశ్వర్ : అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐ ఎస్డీఎస్ జాతీయ కన్వీనర్ మేత్రి రాజశేఖర్ మాట్లాడుతూ… ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో రాజకారుల , దొరల ,దేశ్ముకుల అగాడలను ఎదురించి దున్నేవానికే భూమి ,పండించిన వారికే పంట అని నినదించి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ మరియు తెలంగాణ ప్రజల తెగువను, మహిళల పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్బంగా తెలంగాణ వీర వనిత విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది , చాకలి ఐలమ్మ స్పూర్తితో ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగుతూ ప్రజాఉద్యమలకు, ప్రజలు విద్యార్థులు , ఉద్యోగుల ఉద్యమించాలని పిలునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా నాయకులు దేవి , నరేష్ , రాజు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గంధమల నాగభూషణం , నక్క రాజేందర్ , మట్టాల దీపక్ ,బొడ గణేష్ తదితరులు పాల్గొన్నారు.