ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో అప్పులు

– తీర్చలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య
– చందానగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఘటన
నవతెలంగాణ-చందానగర్‌
డబ్బులు సంపాదించాలనే దురాశతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడి ఆ తర్వాత అప్పులపాలై వ్యక్తి అత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చందానగర్‌ పొలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం రావుల రవికుమార్‌ (43) శ్రీరామ్‌నగర్‌కాలనీ, పటాన్‌ చెరువులో నివాసం ఉంటున్నారు. ఓ ప్రయివేట్‌ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రవికుమార్‌ 5 నెలల నుంచి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌లు ఆడుతున్నాడు. ఇందులో పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకు న్నాడు. తిరిగి ఆడేందుకు డబ్బులు లేకపోవడం ఈ క్రమంలో ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ల నుంచి రుణాలు తీసుకొన్నాడు. ఇలా ఆన్‌లైన్‌ గేమ్‌లలో రుణంతో పాటు తన దగ్గర ఉన్న మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. అప్పులిచ్చిన వారు రోజూ ఫోన్‌ చేసి డబ్బులు అడిగడంతో సమాధానం చెప్పలేక మానసికంగా ఇబ్బంది పడుతూ మనస్థాపం చెందా డు. అయితే భార్య, వరుసకు సోదరుడు అప్పులు తాము తీర్చుతామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ రవికుమార్‌ డిప్రెషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఇటీవల చందానగర్‌లోని తన సోదరుని దుకాణానికి చెందిన డి-బెస్ట్‌ ఫర్నిషింగ్‌ షాపులో సేల్స్‌ మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. భార్య పాల పాకెట్‌ తీసుకురావడానికి వెళ్లాడని భావించింది. రవికుమార్‌ ఈ క్రమంలో తాను పనిచేస్తున్న దుకా ణంలో చున్నీతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. రవి కుమార్‌ సోదరుడు గుర్తించి ఇంటికి ఫోన్‌ చేశాడు. భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.