టీఎస్‌ఈఆర్సీలో దశాబ్ది వేడుకలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ)లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. చైర్మెన్‌ టీ శ్రీరంగారావు సభ్యులు ఎమ్‌డీ మనోహరరాజు, బండారు కృష్ణయ్యతో కలిసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అమరులకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఈఆర్సీ ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మెన్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యాన్ని వివరించారు.ప్రజల ఆకాంక్షల్ని ప్రభుత్వం నెరవేరుస్తున్న తీరును తెలిపారు.