– తెలంగాణ జనసమితి నియోజకవర్గ ఇన్చార్జి సాంబూర్ సోమశేఖర్
నవతెలంగాణ-తాండూరు
తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను, అమరు ల ఆకాంక్షలను విస్మరించి దశాబ్ది ఉత్సవాలు జరుపు తున్నారని తెలంగాణ జనసమితి నియోజకవర్గ ఇన్చార్జి సాంబూర్ సోమశేఖర్ అన్నారు. తాండూరు పట్టణ కేంద్రంలో శుక్రవారం తెలంగాణ జన సమి తి, విద్యావంతుల వేదిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తాండూర్ ఇందిరాచౌక్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీ య జెండా ఎగర వేశారు. ఈ సందర్భంగా తెలం గాణ జన సమితి తాండూర్ నియోజకవర్గ ఇన్చార్జీ మున్సిపల్ కౌన్సిలర్ సాంబూర్ సోమశేఖర్ మాట్లాడు తూ.. ఎంతోమంది అమరుల త్యాగఫలం ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమని అలాంటి రాష్ట్రంలో అమరుల ఆకాంక్షలు విస్మరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారమే పరమావధిగా కుటుంబ పాలన ప్రోత్సహి స్తూ ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెడుతూ ఉద్యమకారులను నిరాదరణకు గురిచేస్తూ తెలంగాణ ఉద్యమకారులను అవమానించిన, ఉద్యమం మీద దాడులు చేసిన ఉద్యమ ద్రోహులకు వ్యక్తులకు మం త్రి పదవులు ఇచ్చి అందలం ఎక్కించారన్నారు. ఉద్య మ వ్యతిరేకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి ఉద్యమకారులకు ఆత్మగౌరవం లేకుండా చేశారన్నా రు. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలన చేస్తున్నా రన్నారు. ఈ ప్రాంత సమగ్రాభివద్ధిపై దష్టిపెట్టి సహజవనరుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిరుద్యోగులను మోసం చేస్తూ లీకేజీల ప్రభుత్వంగా మిగిలిపోయిందని ఇప్పటివరకు అర్హులైన పేదవారికి పథకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, దళితులకు మూడెకరాల భూమి ఇంకా ఇవ్వలేద న్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక పర్యాద రామకష్ణ మాట్లాడుతూ పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ ప్రాంతం వివక్షకు గురికాబడ్డ దన్నారు. ఇప్పటివరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజె క్టు పూర్తి చేయకపోవడమే దీనికి ఉదాహరణ అన్నా రు. తాండూర్ ప్రాంతానికి కూడా మెడికల్ కాలేజ్ రాకపోగా మంజూరైన నర్సింగ్ కాలేజ్ ఇంతవరకు ఊసలేదన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వరాల శ్రీని వాస్ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ నాయకులు అంజిలయ్య, మైదిన్,జనసమితి నాయకులు గౌరి శంకర్, సందీప్, నూరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.