డాక్టర్ ఫణీంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

– టి పి టి ఎఫ్ నిజాంబాద్ అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్
నవతెలంగాణ- కంటేశ్వర్
ఏపీటీఎఫ్ మాజీ అధ్యక్షులు కే. వేణుగోపాల్( కామారెడ్డి) అల్లుడు డాక్టర్ ఫణీంద్ర సోమవారం ఉదయం కార్డియాక్ అరెస్ట్ తో హైదరాబాద్ లో చనిపోయారని తెలుపుటకు చింతిస్తున్నాము అని టిపిటిఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఫణీంద్ర  గాంధీ జనరల్ హాస్పిటల్ హైదరాబాద్ లో డాక్టరుగా పనిచేస్తున్నారు.  వారి అకాల మరణం రెండు కుటుంబాలకు తీరనిలోటు అని అన్నారు.
డాక్టర్. ఫణీంద్ర అంత్య క్రియలు వారి స్వస్థలం హుజూరాబాద్ లో జరుగుతాయి. వారికి టిపిడిఎఫ్ నిజామాబాదు పక్షాన ఆశ్రు నివాళులు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము అని తెలియజేశారు.