26న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి..

– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్
నవ తెలంగాణ – సిద్దిపేట
26న జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ విద్యార్థులను కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా 26న కలెక్టరేట్ ముట్టడికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగిందని, కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యార్థులకు రెండు జతలు దుస్తులు ఇవ్వాలని, అన్ని తరగతుల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని, ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడిని అరికట్టాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ హాస్టలను మెరుగుపరచాలని కోరారు.  ఇప్పటికే రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని, అసలు విద్యారంగాన్ని పట్టించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. తక్షణమే ఈ డిమాండ్లను నిర్వహించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.