నవతెలంగాణ -కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీమతి జి. వైజయంతి ఆదేశాల మేరకు శనివారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి. లక్ష్మి నర్సయ్య, నిజామాబాద్ / కామారెడ్డి జిల్లాలోని కోర్టులో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశములో భారత సాక్షాదారాలు సెక్షన్ 25 & 27, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 65 బి సర్టిఫికేట్ యొక్క ప్రాధాన్యత గురించి వివరంగా విషదీకరించారు. నేరస్తులకు శిక్ష పడేటట్టు నూతన సుప్రీంకోర్టు తీర్పులు సేకరించి దాఖలు చేయాలని తెలిపినారు.ఈ సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పి. రవిరాజ్, రాజ్ గోపాల్ గౌడ్, కవితారెడ్డి, ఆవారి రమేష్, నంద రమేష్, కే. శేషు, నిమ్మ దామోదర్ రెడ్డి, డా॥ సమ్మయ్య, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు యం.డి. రహిమోద్దీన్, భూసారపు రాజేష్ గౌడ్, అశోక్ శివరాం నాయక్, చిదిరాల రాణి, వీరయ్య, పోరిక రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.