విడిపోయిన గూడ్స్‌ రైలు బోగీలు..

– గార్డ్‌ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
నవతెలంగాణ-కేసముద్రం రూరల్‌
పై నుంచి వస్తున్న ఓ గూడ్స్‌ రైలు.. మహబూబాబాద్‌ జిల్లా కే సముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు లింక్‌ తెగిపోవడంతో గమనించిన క్యాబిన్‌ గాడ్‌.. లోకో పైలెట్‌ను అప్రమత్తం చేయడంతో ప్రమాదాన్ని తప్పించాడు. ఇంజన్‌తో కూడిన గూడ్స్‌ రైలు కేసముద్రం నుంచి వరంగల్‌ బయలుదేరి వెళుతున్న క్రమంలో కొన్ని బోగీలు ఇంజన్‌ నుంచి వేరు బడ్డాయి. అలా రైలు.. ఓ కిలో మీటర్‌ మేర ప్రయాణం చేయడంతో గమనించిన క్యాబిన్‌లో ఉన్న గార్డు అప్రమత్తతతో వెంటనే లోకో పైలెట్‌కు సమాచారం ఇవ్వడంతో రైలు ఆపారు. ఆపై విడిపోయిన బోగీలను ఇంజన్‌తో ఉన్న మరో బోగీలకు తగిలించుకొని ప్రయాణం కొనసాగించారు. ప్రమాదం తప్పడంతో లోగో పైలెట్లు, క్యాబిన్‌ గార్డు ఊపిరి పీల్చుకున్నారు.