రెండవ ఎడిషన్ కోసం జాతీయ విజేతలను ప్రకటించిన డెట్టాల్ బనేగా స్వస్త్ ఇండియా

– భారతదేశపు అతి పెద్ద హైజీన్ ఒలంపియాడ్ డెట్టాల్ హైజీన్ ఒలంపియాడ్ రెండవ ఎడిషన్ కోసం జాతీయ విజేతలను ప్రకటించిన డెట్టాల్ బనేగా స్వస్త్ ఇండియా
– భారతదేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన బుడ్గామ్, నమ్ సాయ్, ఉత్తరే, గిర్ సోమనాథ్ మొదలైన వివిధ ప్రాంతాలకు చెందిన 15 మంది విద్యార్థులకు డెట్టాల్ బనేగా స్వస్త్ ఇండియా సీజన్ 10 ఆవిష్కరణలో నగదు బహుమతులతో సన్మానం చేయబడింది.

– డెట్టాల్ హైజీన్ ఒలంపియాడ్ 2.0 భారతదేశంలో పొరుగు దేశాల సరిహద్దులు కలిగిన చివరి గ్రామాలు సహా  28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 30 మిలియన్ కు పైగా విద్యార్థులను చేరుకుంది.
నవతెలంగాణ – హైదరాబాద్: రెకిట్, ప్రపంచంలో ప్రముఖ వినియోగదారు ఆరోగ్యం మరియు హైజీన్ కంపెనీ, రెకిట్ ఫ్లాగ్ షిప్ కాంపైన్ డెట్టాల్ బనేగా స్వస్త్ ఇండియా ద్వారా భారతదేశంలో అతి పెద్ద హైజీన్ ఒలంపియాడ్ యొక్క రెండవ ఎడిషన్ డెట్టాల్ హైజీన్ ఒలంపియాడ్  విజేతలను ప్రకటించింది. బాల్యంలో అనారోగ్యాన్ని నివారించడంలో పరిశుభ్రత వహించే బాధ్యత గురించి చైతన్యం పెంచే లక్ష్యంతో ఒలంపియాడ్ నిర్వహించబడింది. ముంబయిలో జరిగిన డెట్టాల్ బనేగా స్వస్త్ ఇండియా సీజన్ 10లో తమ టీచర్స్ సహా 15 మంది ఒలంపియాడ్ విజేతలకు సన్మానం జరిగింది. డెట్టాల్ హైజీన్ ఒలంపియాడ్ 2.0 దేశంలోని 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 30 మిలియన్ కు పైగా పిల్లలను విజయవంతంగా చేరుకుంది, చేతులు  కడుక్కునే పరిశుభ్రతలో అవసరమైన విజ్ఞానం మరియు ఉత్తమమైన పద్థతులతో దేశంలో అత్యంత సుదూర ప్రాంతాల్లో పిల్లలకు సాధికారత కల్పించింది. 2500 గురుకులాలు మరియు ఇతర ఆధ్మాత్మిక విద్యా పాఠశాలల్లో కూడా విద్యార్థులు పాల్గొన్నారు. విభిన్నమైన ప్రేక్షకులకు అందుబాటులో సంస్కృత భాషలో పరీక్షా ప్రశ్న పత్రాల లభ్యతను ఇవి నిర్థారించాయి. పరీక్ష  పిల్లల కోసం అయిదు స్థాయిలలో విభజించబడింది. దీని ప్రకారం 6 నుండి 16 సంవత్సరాల వారి కోసం ఆరోగ్యం మరియు పరిశుభ్రత పై  మల్టిపుల్ – ఛాయిస్ క్వశ్చన్స్ (ఎంసీక్యూలు) ఉంటాయి. 1వ తరగతి నుండి 2వ తరగతికి చెందిన విద్యార్థులు లెవెల్ 1 పరీక్ష కోసం తయారయ్యారు; లెవెల్ 2 పరీక్షను 3వ మరియు 4వ తరగతి విద్యార్థులు తీసుకున్నారు; లెవెల్ 3 పరీక్షను 5 మరియు 6వ తరగతికి చెందిన విద్యార్థులు తీసుకున్నారు; 7వ మరియు 8వ తరగతి వారి కోసం లెవెల్ 4; మరియు 9వ మరియు 10వ తరగతి విద్యార్థులు లెవెల్ 5 పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 15 మంది విద్యార్థులకు (ప్రతి స్థాయిలో ముగ్గురు) నగదు బహుమతులు అందచేయబడ్డాయి. మొదటి స్థానం పొందిన వారు రూ. 50,000, రెండవ స్థానం విజేతలు రూ. 35,000 మరియు మూడవ స్థానం విజేతలు రూ. 15,000 గెలుచుకున్నారు.
రవి భట్నాగర్ , డైరక్టర్ , ఎక్స్ టర్నల్ అఫైర్స్ & పార్ట్ నర్ షిప్స్, ఎస్ఓఏ, రెకిట్, ఇలా అన్నారు, “పరిశుభ్రత, ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యాలు కోసం రెకిట్ వారి నిబద్ధత అనుకూలమైన పారిశుద్ధతతో సంబంధమున్న డమైన్స్ లో ఛాంపియన్స్ అవడానికి  భారతదేశపు యువ మేధస్సులను ప్రేరేపించింది. భారతదేశంలోని సుదూర ప్రాంతాల్లో చేరుకునే కార్యాన్ని చేపట్టిన డెట్టాల్ హైజీన్ ఒలంపియాడ్ (డీహెచ్ఓ) రెండవ ఎడిషన్ యొక్క ఆశ్చర్యకరమైన ఫలితాలను చూసి మేము ఎంతో ఆనందించాము;నమ్ సాయ్ మరియు అంజా నుండి, చివరి గ్రామాలు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులను పంచుకున్నాయి, గుజరాత్ లోని సుదూర  తలాలా వరకు, సిక్కింలోని నేపాల్ సరిహద్దు వద్ద ఉత్తరే నుండి మిజోరాంలోని చంపాయ్ వరకు, కాశ్మీర్ లోని బుడ్గాం వరకు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పిల్లల విజయాలను సంబరం చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మరియు దేశపు ఆరోగ్య ప్రగతికి  వారి ఉత్సుకత మరియు విజ్ఞానం తోడ్పడుతుందని మేము ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నాము.”

స్థానం విద్యార్థి జిల్లా రాష్ట్రం /యూటీ
లెవెల్ 1 విజేతలు (తరగతి 1-2)
1 సోమేష్ ఉత్తర కాశీ ఉత్తరాఖండ్
2 రోషన్ పనికా నమ్ సాయ్ అరుణాచల్ ప్రదేశ్
3 అవ్రీత్ కౌర్ సిర్మోర్ హిమాచల్ ప్రదేశ్
లెవెల్ 2 విజేతలు (తరగతి 3-4)
1 ఏ ఒవియా మీనాచిపేట పుదుచ్చేరి
2 నవీన్ బికనీర్ రాజస్థాన్
3 పరి సోన్ కెర్ గోరఖ్ పూర్ ఉత్తర్ ప్రదేశ్
లెవెల్ 3 విజేతలు (తరగతి 5-6)
1 సాక్షి కోటా రాజస్థాన్
2 స్టాన్జిన్ పుజాంగ్ లెహ్ లడఖ్
3 షామ్నూర్ ఇబ్రహింభాయ్ మజ్గుల్ జాంబూర్, గిర్ సోమనాథ్ గుజరాత్
లెవెల్ 4 విజేతలు (తరగతి 7-8)
1 సఫీనా బటూల్ నౌగవాన్, అమ్రోహ ఉత్తర్ ప్రదేశ్
2 నిఖిల్ చౌబే జగ్డోర్, మహరాణి గంజ్ ఉత్తర్ ప్రదేశ్
3 వి శరణ్ కుమార్ తిరుచిరాపల్లి తమిళనాడు
    లెవెల్ 5 విజేతలు (తరగతి 9-10)
1 యు దినేష్ నాగర్ కర్నూల్ తెలంగాణా
2 ఫోజియా జెహ్రా ఇషిగామ్ బుడ్గామ్ జమ్ము & కాశ్మీర్
3 పీమా చోడెన్ తమంగ్ ఉత్తరే, గ్యాల్షింగ్ సిక్కిం

సుదూర ప్రాంతానికి యాక్సెస్ ను నిర్థారిస్తూ మరియు పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యం గురించి యువ మేధస్సులకు సరైన విజ్ఞానంతో చైతన్యవంతం చేస్తూ, సానుకూలమైన పారిశుద్ధ్యాన్ని అనుసరించడానికి డెట్టాల్ హైజీన్ ఒలంపియాడ్ దేశవ్యాప్తంగా ఒక వేదికను కేటాయించింది. వివిధ నిమగ్నమయ్యే కార్యకలాపాలు మరియు డెట్టాల్ హైజీన్ పాఠ్యాంశం ద్వారా డెట్టాల్ బనేగా స్వస్త్ ఇండియా డెట్టాల్ హైజీన్ పాఠ్యాంశం కార్యక్రమం ద్వారా ఆరు కీలకమైన చేతులను శుభ్రం చేసే సందర్భాలు గురించి పిల్లలకు అవగాహన కల్పించడానికి అంకితమైంది. దీనిలో మల విసర్జన చేసిన తరువాత, మరుగుదొడ్లను వినియోగించిన తరువాత చేతులు శుభ్రం చేసుకోవడం; ఆహారం తినడానికి ముందు; ఆహారం తయార చేసి, వడ్డించడానికి ముందు; పిల్లలు/శిశువులకు ఆహారం అందచేయడానికి ముందు; పిల్లల మల మూత్రాలను శుభ్రం చేసిన తరువాత మరియు అనారోగ్యంగా ఉన్న సమయంలో దగ్గిన తరువాత/తుమ్మిన తరువాత వంటివి భాగంగా ఉన్నాయి. వచ్చే సంవత్సరంలో కార్యక్రమం మూడవ ఎడిషన్ తో మరింత ఎక్కువమంది పిల్లలను చేరుకుని మరియు మరింత సానుకూలమైన ప్రభావంతో  మళ్లీ వస్తుంది.

తెలంగాణ డెటాల్ హైజీన్ ఒలింపియాడ్ 2.0 విజేతలు క్రిందివారు:
దినేష్ : ధైర్యం మరియు పట్టుదలల యొక్క గాథ దినేష్. అతను చెంచు కమ్యూనిటీకి చెందిన ప్రైవేట్. ప్రిమిటివ్ ట్రైబల్ సమూహానిచి చెందిన వ్యక్తి. తెలంగాణ, నాగర్ కర్నూలు, అమ్రాబాద చుట్టుప్రక్కల నివసించే ఆదివాసి వంశానికి చెందిన వ్యక్తి. అతను తనకు 5 ఏళ్ల వయస్సులో అనగా 2014లో తన తల్లిని కోల్పోయాడు. ప్రైవేట్ పాఠశాలలో చదవడానికి అతని ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు మరియు అతని తండ్రి నిత్యావసరాలు కోసం పోరాడుతున్నాడు. గిరిజనల పిల్లల గురించి క్రమబద్ధంగా చేసిన వార్షిక సర్వేలో, టీడబ్ల్యూఆర్ఈఐఎస్ (బీ) మన్నూర్ స్కూల్ దినేష్ ను ‘అవుట్-ఆఫ్ –స్కూల్’ పిల్లల్లో భాగంగా గుర్తించింది. ఎందుకంటే గిరిజనుల పిల్లల్లో ఇది ప్రబలంగా ఉంది. కుటుంబంలో ఉన్న క్లిష్టమైన పరిస్థితి వలన స్కూల్ అతడ్ని నివాసిత విద్యార్థిగా నమోదు చేసింది. దినేష్ కు జీవితం సజావుగా కొనసాగలేదు. అతను దురదృష్టకరమైన ఘటనను ఎదుర్కొన్నాడు మరియు అతను ముఖం, చేతులు, ఛాతీ పై రెండవ స్థాయికి చెందిన కాలిన గాయాలతో బాధపడ్డాడు. ఆరోగ్యశ్రీ ప్రభుత్వం పథకం కింద అతనికి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేసారు మరియు అతనికి మూడు సర్జరీలు కూడా చేసారు. ఒకటి అతనికి 04 ఏళ్ల వయస్సులో మరియు రెండవది 12 ఏళ్ల వయస్సులో చేసారు. దినేష్ జీవితంలో అన్ని సవాళ్లు ఎదురైనా కూడా, అన్ని రంగాల్లో అతను మట్టిలో మాణిక్యం వలే అభివృద్ధి చెందాడు. మంచి సమాచారం, సంభాషణా చాతుర్యాలు అభివృద్ధి చేసుకోవడానికి దినేష్ శ్రమించాడు మరియు 600 మంది విద్యార్థుల్లో అతను అత్యంతగా వ్యక్తీకరించే మరియు పరస్పరం సంభాషించే విద్యార్థిగా నిలిచాడు. దినేష్ క్రమశిక్షణ గల, కష్టపడి శ్రమించే, స్వీయ-ప్రేరణ గల మరియు స్వతంత్ర భావాలు గల యువకుడు. అతను క్రీడలు, చదువు రెండిటిలో మంచి స్థానంలో నిలిచాడు మరియు పాఠశాల తరపున వివిధ అంతర-పాఠశాల క్రికెట్ పోటీలకు ప్రాతినిధ్యంవహించాడు. దినేష్ కు ఎంతో పోటీయుత స్ఫూర్తి ఉంది ఫలితంగా అతను జోనల్ స్థాయిలో ఇగ్నైట్ ఫెస్ట్ కోసం కూడా ఎంపిక చేయబడ్డాడు. డెట్టాల్ హైజీన్ ఒలంపియాడ్ 2.0కి ధన్యవాదాలు, దినేష్ మొదటిసారి రిజర్వ్ ప్రాంతం నుండి బయట అడుగు పెట్టాడు. ప్రపంచం ఎదురుగా మెరిసే బంగారు అవకాశం ఇది అతనికి ఇచ్చింది.