– త్వరలో బస్సు డిపో ప్రారంభం
– 29న ఆత్మీయ సమ్మేళనం
– విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే
నవతెలంగాణ-ఇల్లందు
ఈ నెల 29న ఇల్లందు పట్టణ బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ హైదరాబాద్ వెళ్లినందున ఈనెల 27న జరగాల్సిన పట్టణ ఆత్మీయ సమ్మేళనం 29న నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పోడుభూములకు పట్టాలు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. డయాలసిస్ సెంటర్ ఇల్లందుకు రావడం గొప్ప విషయమన్నారు. గతంలో డయాలసిస్ కొరకు ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ వెళ్లేవారని ఇక వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని 5 బెడ్లతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు అయినట్టు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్ల పబ్లిక్ హెల్త్ నుంచి రూ.14 కోట్లు రావడం జరిగిందని, అందులో నుంచి రూ.5.76 కోట్లతో బుగ్గవాగు డ్రైన్ నిర్మాణం చేప్పట్టనున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మరల రూ.25 కోట్లు ఇవ్వగా వాటితో కౌన్సిలర్లు, ప్రజలు ఏమి అభివృద్ధి కోరుకుంటున్నారో వాటిని పూర్తి చేయనున్నామన్నారు. ఫిబ్రవరి 28న డియంఎఫ్టి రూ.20 కోట్లను కేటాయించారని తెలిపారు. ఆ నిధులతో కమ్యూనిటీ హాల్, బుగ్గవాగు డ్రైన్ నిర్మాణం,కరెంట్ ఆఫీస్ వరకు గల డివైడర్లకు, లలిత్ కళ మందిర్ రోడ్డు, చెరువు కట్ట, ఆర్‌అండ్‌ఆర్ కాలనీలలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలి పారు. ప్రజల చిరకాల కోరికైనా బస్ డిపో నిర్మాణం పూర్తి అయిందని, బస్సు ల రాకపోకలకు ఇబ్బం దులు కలు గకుండా రూ.1.50 కోట్లతో సిసి రోడ్డు పనులు జరుగుతున్నాయని, పనులు పూర్తి కాగానే మంత్రి పువ్వాడ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇల్లందు అభి వృద్ధిని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని, అబివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధులు ఎంతగానో సహకారం అందించారని స్పష్టం చేశారు. ఈనెల 29న జరిగే ఆత్మీయ సమ్మేళ నాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమా వేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పులిగళ్ల మాధవరావు, టిబిజికెఎస్ ఉపాధ్యక్షుడు ఎస్.రంగనాథ్, పివి.కృష్ణారావు పాల్గొన్నారు.