నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : ప్రజాగాయకుడు గద్దర్ అంతిమ యాత్రలో పాల్గొంటూ గుండెపోటుకు గురై మరణించిన సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను డీజీపీ అంజనీ కుమార్ పరామర్శించారు. లక్డీకాపూల్‌లోని జహీరుద్దీన్ నివాసానికి వెళ్లిన డీజీపీ ఆయన హఠాన్మరణం పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని కుటుంబీకులకు తెలియజేశారు. సియాసత్ వంటి ప్రముఖ ఉర్దూ పత్రికకు మేనేజింగ్ ఎడిటర్‌గా ఉండటమేగాక, ఉన్నతమైన పాత్రికేయ విలువలను కాపాడటంలో చేసిన కృషి ఎనలేనిదని ఆయన అన్నారు.
అంతేగాక, మత సామరస్యాన్ని కాపాడటానికి ఆయన పలు సందర్భాల్లో చూపిన చొరవ కూడా సామాన్యమైంది కాదని శ్లాఘించారు.