రవాణా రంగ కార్మికుల ధర్నా..

నవతెలంగాణ- కంటేశ్వర్
తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రయివేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆల్ డ్రైవర్స్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు కటారి రాములు మాట్లాడుతూ.. రవాణ రంగ కార్మికులకు సామాజిక బోర్డుటీయూను ఏర్పాటు చేయాలని, ఆర్టీఏ అధికారులు, పోలీసుల వేధింపులు ఆపాలని, థర్డ్ పార్టీ ప్రీమియం ఇన్సూరెన్స్ డబ్బులు, ఫిట్నెస్ చార్జీలను తగ్గించాలని, ప్రభుత్వమే షరతులు లేకుండా ఆటోలను టాక్సీలను ఇవ్వాలని, డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కో కన్వీనర్ ధ్యారాంగుల కృష్ణ, ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు కృష్ణ పండరి, ముజీబ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.