హైటెక్‌ కాపీయింగ్‌పై చర్యలు : డీఐఈవో

 నవతెలంగాణ ఎఫెక్ట్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎస్‌ఆర్‌నగర్‌ అమోఘ జూనియర్‌ కాలేజీలో(సీనెం.60334) ఈనెల 15న జరిగిన ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్ష గణితశాస్త్రం 1బీ హైటెక్‌ కాపీయింగ్‌ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి(డీఐఈవో) దాసరి వడ్డెన్న స్పంది స్తూ.. ఎస్‌ఆర్‌ నగర్‌ అమోఘ కాలేజీ హైటెక్‌ కాపీయింగ్‌పై అదే రోజున(గు రువారం) సంబంధిత డిపార్టుమెంటల్‌ ఆఫీసర్‌(డీవో), చీఫ్‌ సూపరిటెండెంట్‌ (సీఎస్‌)పైన శాఖ పరమైన చర్యలు తీసుకుంటూ.. వారిని పరీక్షా విధులను నుంచి తొలగించామని, ఆస్థానంలో మరొకరిని నియమించి పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించామని డీఐఈవో వడ్డెన్న వివరించారు.