– మండలి చైర్మెన్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శాసనమండలి సమావేశాల్లో పాఠశాలల మనుగడపై చర్చించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, చీఫ్‌విప్ భానుప్రసాదరావును గురువారం కలిసి లేఖ సమర్పించానని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గిరిజన సంక్షేమ పాఠశాలల మనుగడ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించా లని సూచించారు. రాష్ట్రంలో కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), ఇతర విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులకు ఆర్టికల్ 39 ప్రకారం కనీస వేతనాల చెల్లింపుపై చర్యలు చేపట్టాలని కోరారు.