మణిపూర్‌ ప్రజలకు సంఘీభావంగా కొవ్వత్తుల ప్రదర్శన

నవతెలంగాణ- మియాపూర్‌
మణిపూర్‌ ప్రజలకు సంఘీభావంగా చందా నగర్‌ పీజేఆర్‌ స్టేడియం వద్ద సీపీఐ(ఎం), సీపీిఐ ఆధ్వర్యంలో కొవ్వుతుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీిఐ, సీపీఐ(ఎం) శేరిలింగంపల్లి జోన్‌ కార్యదర్శులు రామకష్ణ, శోభన్‌ లు మాట్లాడుతూ మణిపూర్‌ దారుణాలను తీవ్రంగా ఖండించారు. గత 3, 4 నెలలుగా మణిపూర్‌ లో తీవ్రంగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వము సరిగ్గా స్పందించటం లేదన్నారు. సభ్య సమాజం సిగ్గపడేలా మహిళల పై ఘోరాలు జరుగుతున్నా మోదీ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వ్యాహహరిస్తున్నదన్నారు. ప్రపంచం నాయకుడు అని ప్రచారం చేసుకుంటూ స్వంత ప్రజల్ని గాలికి వదిలేశారన్నారు.. అమాయక గిరిజన ప్రజలపై దాడులు ఆపాలని దోషులను ఖఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రజల్ని కులాలు తెగలు మతాలుగా విభజించి పాలించటం ఆపాల న్నారు. ప్రదర్శనలో నాయకులు చందు యాదవ్‌, శ్రీనివాస్‌, మాణిక్యం, కష్ణ, నాగరాజు, నాయుడు, శ్రీనివాస్‌, శంకర్‌ తదతరులు పాల్గొన్నారు.