వంతెన నిర్మాణం.. వెతలు దూరం

– ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సహకారంతో అందుబాటులోకి బ్రిడ్జి
– సర్పంచ్‌ శంకర్‌ నాయక్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ-కొడంగల్‌
దశాబ్దాల కాలంగా వర్షాకాలంలో కొడంగల్‌ మండలంలోని పోచమ్మ తండా నుంచి మైసమ్మ తండా వెళ్లే రోడ్డులో వర్షానికి వాగు రావడం వల్ల మైసమ్మతాం డ, కాజమ్మద్‌ పల్లి గ్రామాల ప్రజలతో పాటు, ఇతర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డికి విన్నవించారు. ఈ నేపథ్యంలో పోచమ్మ తాండ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులను మం జూరు చేయగా, గతేడాది బ్రిడ్జి నిర్మాణాం పూర్తి కావడంతో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది.
దశాబ్దాలుగా ఇక్కట్లు
ప్రతి వర్షాకాలంలో వర్షాలు కురిసినప్పుడు ఈ రోడ్డు నుంచి పలు గ్రామాలకు వెళ్లే ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడేది. వాహనదారులు, కాలినడకన వెళ్లేవారు వెళ్లలేని పరిస్థితి. దీంతో దశాబ్దాలుగా రెండు గ్రామాల ప్రజలతో పాటు, ఇతర గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు.
తీరిన ప్రజల కష్టాలు
బ్రిడ్జి నిర్మాణంతో ప్రజల కష్టాలు తీరి రాకపోకలు సులభతరం అయ్యాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడం తో ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. ఇబ్బందులు తప్పడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పోచమ్మతండా సర్పంచ్‌ శంకర్‌ నాయక్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. వాగు పారుతుడడంతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్‌ కాల్యా నాయక్‌, పేంట్యా నాయక్‌, పాండు, రాములు, భవన్‌నా యక్‌, చందర్‌, తదితరులు పాల్గొన్నారు.