26,226 మంది విద్యార్థులకు 1.1 లక్షల నోటు పుస్తకాల పంపిణీ

– 17వ ఏటా సీఎస్‌ఆర్‌ కింద పై ఇంటర్నేషనల్‌ సేవా కార్యక్రమం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సామాజిక సేవా కార్యక్ర మం(సీఎస్‌ఆర్‌) కింద ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ పై ఇంటర్నేషనల్‌ ప్రతి ఏటా సామాజిక సేవా కార్య క్రమాలను కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో 26,226 మంది విద్యార్థులకు 1.1 లక్షల నోటు పుస్తకాలను పంపిణీ చేస్తున్నది. ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపక ఎండీ రాజ్‌ కుమార్‌ పై, ఎఫ్‌డీ మీనా ఆర్‌ పై, సేల్స్‌ డైరెక్టర్‌ రాహుల్‌ఆర్‌ పై, డైరెక్టర్లు గురుప్రసాద్‌ పై, ఉత్తమ్‌ కుమార్‌ పై, పుష్ప పై, ఎస్‌. జయశ్రీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 4000 మంది విద్యార్థులకు 20 వేల నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో 20 స్కూళ్లకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా రాజ్‌కుమార్‌ పై మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా తుంకూర్‌, మైసూ ర్‌, ఉడిపి, మంగళూరు, కేరళలో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలి పారు. ప్రస్తుతం హైదరాబాద్‌ విద్యార్థులకు సేవలందిస్తున్నామని చెప్పారు.