31 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఎత్తున సాయం అందుతుందని రైతు బంధు జిల్లా సమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఎంపీ నామ కృషితో 31 మందికి మంజూరైన రూ.14,45,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను గురువారం ఖమ్మంలోని ఎంపీ క్యాంప్‌ కార్యాలయం నల్లమల చేతుల మీదుగా అందజేశారు. నల్లమల మాట్లాడుతూ నామ అంటే ఒక భరోసా అన్నారు. పేదలకు అవకాశం ఉన్నంత వరకు సాయం అందించడమే నామ లక్ష్యమన్నారు. ప్రతి వారం ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో పండుగ వాతావరణంలో సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ చేపడుతున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంలో దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా సాయం అందుతుందని అన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో పథకం రూపంలో లబ్ది చేకూరుతుందని అన్నారు. చారిత్రాత్మకమైన మహిళా బిల్లును స్వాగతిస్తూ రానున్న ఎన్నికల నుంచే రిజర్వేషన్లు అమలు చేయాలని నల్లమల వెంకటేశ్వరరావు కోరారు. కార్యక్రమంలో ఎంపీ క్యాంప్‌ ఆఫీస్‌ ఇంచార్జ్‌ కనకమేడల సత్యనారాయణ, జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్‌, మధిర మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ వంకాయలపాటి లచ్చయ్య, ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం ఎంపీటీసీ నాయకులు మాధవి కిరణ్‌, యాదవ సంఘం నాయకులు ధనియాకుల వీరాస్వామి, పాపారావు, సామాజిక వేత్త శేషయ్య, నాయకులు గోడ్డేటి మాధవరావు, వాకదాని కోటేశ్వరరావు, గాంధీనగర్‌ సర్పంచ్‌ లలిత దేవి డేవిడ్‌, నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేష్‌, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్‌, మునిగంటి భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌ అనైతికం: తెలుగుదేశం ఆఫీస్‌ వద్ద ఆటో డ్రైవర్ల దీక్షకు నల్లమల వెంకటేశ్వరరావు మద్దతు
ఎలాంటి ఆధారం లేకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్‌ చేయడం అక్రమం, అనైతికమని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు ఖండించారు. చంద్రబాబు అరెస్ట్‌ ను ఖండిస్తూ ఖమ్మంలోని పార్టీ కార్యాలయం వద్ద గురువారం రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఆటో డ్రైవర్ల శిబిరం వద్దకు వెళ్లి, మద్దతు, సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నల్లమల మాట్లాడుతూ వచ్చిన ఆరోపణలపై ముందస్తు విచారణ చేయకుండా.. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని అన్నారు. అరెస్టులో రాజకీయ దురుద్దేశం దాగి ఉందని, వెంటనే చంద్రబాబును విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు కనకమేడల సత్యనారాయణ, జిల్లా యాదవ్‌ సంఘం నాయకులు చిత్తారు సింహాద్రియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.