విద్యార్థులకు వంట సామాగ్రి, నోట్‌ బుక్స్‌ పంపిణీ

– బీఆర్‌ఎస్‌ మాజీ పరిగి పట్టణ అధ్యక్షుడు గౌస్‌ పాషా
నవతెలంగాణ-పరిగి
విద్యార్థులు విద్యలో రాణించాలని బీఆర్‌ఎస్‌ మాజీ పరిగి పట్టణ అధ్యక్షుడు గౌస్‌ పాషా అన్నారు. మంగళవారం పరిగి పట్టణం ఎర్రగడ్డపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో బీఆర్‌ఎస్‌ మాజీ పరిగి పట్టణ అధ్యక్షుడు గౌస్‌ పాషా తన సొంత డబ్బులతో విద్యార్థు లకు నోటుబుక్స్‌, వంట సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రభుత్వ పాఠ శాలలో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. ఎంతోమంది ప్రతిభావంతులైన ఉపాధ్యాయులతో విద్య బోధన కొనసాగుతుందన్నారు. గతంతో పోలిస్తే విద్య వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చాయని, దానికనుగుణంగా విద్య కొనసాగుతుందన్నారు. విద్యార్థులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నారన్నారు. నేడు ప్రయివేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయన్నారు. విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలని అప్పుడే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ నాగేశ్వర్‌, పసియోద్దీన్‌, యూసుఫ్‌, ఖలీల్‌, హజారుద్దీన్‌, గౌసి దిన్‌, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.