రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  నిత్యావసర సరుకులు, బ్లాంకెట్లు, చాపలు పంపిణీ

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో అకాల వర్షాల వలన దయ్యాల వాగు, గుండ్ల వాగు యొక్క వరద ఉధృతికి కొట్టుకుపోయిన వరద బాధితులకు రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ సహాయ సహకారాలతో ఆదివారం ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క  200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బ్లాంకెట్లు మరియు చాపలు అందజేశారు. అలాగే వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ అండగా నిలబడతా అని, నష్టం జరిగినా ప్రతి ఒక్కరికీ నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటా అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి, మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్,  ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, జెట్టి సోమయ్య, పంగ శ్రీను, దేపాక కృష్ణ, యనమద్దిని శ్రీను, మిరియాల యాదగిరి రెడ్డి తదితర గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.