జిల్లా బీసీ హక్కుల పరిరక్షణ సంక్షేమ సంఘం సమావేశం

నవతెలంగాణ- కంటేశ్వర్  
జిల్లా బీసీ హక్కుల పరిరక్షణ సంక్షేమ సంఘం సమావేశం జరిగినది సమావేశం నిర్వహించారు విలేకరుల సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మాయావార్ రాజేశ్వర్ మాట్లాడుతూ.. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా చట్టసభల్లో అనగా అసెంబ్లీ పార్లమెంటులో 50 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వర్ డిమాండ్ చేశారు బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాజేశ్వర్ డిమాండ్ చేశారు బీసీలకు కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్లు కేటాయించాలని రాజేశ్వర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కేంద్ర ప్రభుత్వం మండల కమిషన్ నివేదిక ఆధారంగా ఓ బీసీలకు 27% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాజేశ్వర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు వచ్చే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు సీట్లు కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రాజేశ్వర్ కోరారు కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ కుల జన గణనను చేపట్టాలని కేంద్రాన్ని రాజేశ్వర్ కోరారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న బీసీ బందును అన్ని కులాలకు నిరుపేదలను గుర్తించి ఆదుకోవాలని ఆర్థిక సహాయం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజేశ్వర్ కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్ లో ఉన్న బీసీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం రాజేశ్వర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరినారు ఈ యొక్క సమావేశంలో డి రమేష్ నీలకంఠం కే నీలం గోవర్ధన్ చారి రేఖ దుర్గాప్రసాద్ భాస్కర్ లింగం మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు