క్రోమ్‌లో దీపావళి ఆఫర్లు

హైదరాబాద్‌ : దీపావళి పండుగ సందర్బంగా ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తున్నట్లు టాటా గ్రూపునకు చెందిన క్రోమ్‌ తెలిపింది. ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌’ క్యాంపెయిన్‌లో తమ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్లు, ఇతర విభాగాల ఉత్పత్తులపై పలు ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తున్నామని పేర్కొంది. తగ్గింపు ధరలు నవంబర్‌ 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.