శిశువు మృతిపై డీఎంహెచ్‌ఓ ఆరా

నవతెలంగాణ-చండ్రుగొండ
మండలకేంద్రమైన చండ్రుగొండలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో శిశువు మృతిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ శీరిష ఆరా తీశారు. పీహెచ్సీని శుక్రవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. తిప్పనపల్లికి చెందిన సయ్యద్‌ ఫర్జాన అనే మహిళ కాన్పు నేపథ్యంలో శిశువు మృతి చెందిన విషయం విదితమే. ఈ ఉదంతంపై డీఎంహెచ్‌ ఓ శీరిష, స్థానిక డాక్టర్‌ తనుజను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సాధరణ కాన్పులు ప్రభుత్వాసుపత్రుల్లోనే జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చండ్రుగొండలో లక్ష్యాలను మించి కాన్పులు చేస్తున్నారన్నారు. శిశువు మృతి విషయంలో వైద్యపరంగా ఎలాంటి లోపం లేదన్నారు. శిశువు ఉమ్మనీరు తాగడం, తల్లికి నొప్పులు సక్రమంగా రాకపోవడంతోనే శిశువు మరణించినట్లు ఆమె తెలిపారు.