పీహెచ్సీని సందర్శించిన డీఎంహెచ్‌వో

నవతెలంగాణ-ముదిగొండ
ముదిగొండ పీహెచ్‌సీని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి మాలతి మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ఆమె నిశితంగా పరిశీలించారు. రిజిస్టర్లను ఆమె తనిఖీ చేశారు. ఆసుపత్రి వైద్యాధికారి అరుణాదేవితో ఆమె మాట్లాడి వైద్యపరీక్షలకు మహిళలు అధికంగా వచ్చేలా చూడాలన్నారు. వైద్య పరీక్షలకు హాజరైన మహిళలతో ఆమె మాట్లాడి వైద్య పరీక్షలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి అంకం అరుణాదేవి, సిహెచ్‌ఓ గుండాల దుర్గమల్లేశ్వరి, సూపర్వైజర్‌ లత,ఆశలు వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
కామేపల్లి పీహెచ్‌సీని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
కామేపల్లి : కామేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బెజవాడ సైదులు మంగళవారం అకస్మికంగా సందర్శించి రికార్డులు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య మహిళా కార్యక్రమం అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పలు సలహాలు సూచనలు చేశారు. మహిళలు ఆరోగ్య మహిళ కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్‌ నెల్లూరు చందన, వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.