ఆ పేపర్లను తొలగించవద్దు

ఢిల్లీ వర్సిటీ వీసీకి ఆర్థిక అధ్యాపకుల వినతి
న్యూఢిల్లీ : జాతీయ విద్యా విధానంలో భాగంగా మూడు ఐచ్ఛిక పేపర్లను తొలగిం చాలన్న ప్రతిపాదనను ఉపసంహరించు కోవాలని ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఆర్థిక శాస్త్ర ఉపాధ్యాయులు వైస్‌ ఛాన్సలర్‌ యోగేష్‌ సింగ్‌ను కోరారు. ‘ఆర్థిక వ్యవస్థ -దేశం-సమాజం’,ఉత్పత్తి సంబంధాలు -ప్రపంచీకరణ’, ‘వివక్షకు సంబంధించిన ఆర్థిక శాస్త్రం’ పేరిట ఉన్న ఐచ్ఛిక పేపర్లను తొలగించాలని గత నెల 26న జరిగిన యూనివర్సిటీ విద్యా మండలి సమావేశం ప్రతిపాదించింది.
అయితే ఈ ప్రతిపాదన అసమగ్రంగా ఉన్నదని, ఈ పేపర్లను గత 40 సంవత్సరాలుగా బోధిస్తున్నామని అధ్యా పకులు తెలిపారు. ఈ పేపర్లు సమకాలీన ప్రపంచం గురించి విద్యార్థులకు లోతైన అవ గాహన కలిగి స్తున్నాయని కిరోరిమాల్‌ కళా శాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సౌమ్యజిత్‌ భట్టాచార్య చెప్పారు. ఈ పేపర్లు విద్యార్థు లలో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. వీటి ద్వారా కార్ల్‌ మార్క్స్‌ నుండి జోసెఫ్‌ అలోయిస్‌ వరకూ ఎందరో ప్రముఖుల సిద్ధాంతాలను గురించి విద్యార్థులు తెలుసు కుంటున్నారు. విద్యార్థులకు ఫోర్డ్‌ కార్ల గురించి బోధిస్తున్నామని, అలాంట ప్పుడు ప్రముఖుల సిద్ధాంతాలను గురించి చెబితే తప్పేముం దని భట్టాచార్య ప్రశ్నించారు. ఈ పేపర్లను ప్రైవేటు, విదేశీ యూనివర్సిటీలలో కూడా బోధిస్తున్నారని భట్టాచార్య చెప్పారు. ఉపయోగకరమైన చర్చలు జరగకుండా నివారిస్తే విద్యార్థులు క్రమశిక్షణతో ఎలా ప్రవర్తిస్తారని ఆయన ప్రశ్నించారు.