– టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆదే ప్రవీణ్
నవతెలంగాణ- కంటేశ్వర్
తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేయకండి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆదే ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువాము నిజామాబాద్ నగరంలోని స్థానిక ప్రెస్లబ్లో ఏర్పాటు, చేసిన సమావేశంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు అదే ప్రవీణ్ మాట్లాడుతూ.. తెలంగాణ మళిదశ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో మమేకమై పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత మన బ్రతుకులు మారతాయని మరియు రాజకీయంలో అన్ని ఫలాలు అందుతాయని కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తుంది.అయినాగాని ఉద్యమకారులకు ఏలాంటి ప్రాతినిధ్యం కల్పించడం లేదని మరియు వారికి ఆర్ధికంగా ఆదుకోవడంలోగాని లేదా తెలంగాణ పథకాలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక ఉద్యమకారుడికి వయస్సు పైబడుతున్న వారికి పెన్షన్ అందే విధంగా చూడాలని ఆదే ప్రవీణ్ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా కోరారు.తెలంగాణ ఉద్యమ సభలలో నిండు సభలలో ఉద్యమనేత కెసిఆర్ చెప్పినట్లుగా ఉద్యమకారులకు పాలిటిక్స్లో సరైన ప్రాతినధ్యం వహించే విధంగా చూస్తానని తెలిపినట్లు, ప్రతి ఒక బిసి ఉద్యమ నేతను అక్కున చేర్చుకొని సరైన విధంగా రాజకీయంలో ప్రాతినిద్య వహించేలా ప్రొత్సిహించాలని, ఎక్కువ శాతం ఉన్న బిసిలకు జనాభ ధమాకా ప్రకారం బిసిలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో మాజీ టిఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎ.యస్. పోశెట్టి, జిల్లా నాయకులు ఈర్ల శేఖర్, కోనేరు సాయికుమార్, గిరిధార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.