కార్మిక సమస్యలు మీకు పట్టవా..

– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే.వెంకటేష్‌
– కార్మిక సత్తా చాటండి
– సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్‌రావు
నవతెలంగాణ-పెనుబల్లి
దేశ జీడీపీ వృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న కార్మికవర్గ సమస్యలు మీకు పట్టవా అని, ఎన్నికల పోటీలో మానిపోస్ట్‌లు విడుదల చేసిన రాజకీయ పార్టీలను సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే.వెంకటేష్‌ ప్రశ్నించారు. శనివారం పెనుబల్లి మండల పరిధిలోని వీఎం.బంజరలోని సప్తపది ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన సీఐటీయూ సత్తుపల్లి నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ తోడు దొంగలని, చీకటి ఒప్పందాలు చేసుకొని దేశ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కార్మిక శ్రేయస్సుకు కృషి చేసే వారికే ఉద్యోగులు, కార్మికులు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కమిటి సభ్యులు చలమాల విఠల్‌రావు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో కార్మికవర్గానికి ద్రోహం చేసిన వారికి కార్మిక సత్తా ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్‌, జిల్లా ఉపేందర్‌, జిల్లా కమిటి సభ్యులు కొలిక పోగు సర్వేశ్వరరావులు ప్రసంగించారు. ఈ సమావేశంలో సీఐటీయూ అనుబంధ సంఘాల నాయకులు మస్తాన్‌,తాండ్ర రాజేశ్వరరావు, ప్రతాప్‌, చీపి వెంకటేశ్వరరావు, గుడిమెట్ల బాబు, మిట్టపల్లి నాగమణి, లలిత, నాగేంద్ర, రామేశ్వరి, నాగలక్ష్మి, పుష్ప, పద్మ, నాగమణి, తుంగా శేషయ్య, సాధు శరత్‌ బాబు, రాణీ రుద్రమదేవి, సాయి, నాగేశ్వరరావు, మీసాల వెంకటరావు, బెజవాడ లక్ష్మీ నారాయణ, మట్టపర్తి, సత్యనారయణ, వరలక్ష్మి, జిలానీ, మాధవరావు, జమాలుద్దీన్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నేత గాయం తిరుపతిరావు, ఎస్‌ఎఫ్‌ఐ నేత బెజవాడ సాయిశేషు, చలమాల నరసింహారావు పాల్గొన్నారు.