లవంగం టీ ఒక హెర్బల్ టీ మాత్రమే కాదు, ఇది శరీరానికి కావాల్సిన అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కొన్ని సందర్భాలలో అతిగా తింటుంటాం. అలాంటి సమయంలో ఆ ఆహారం త్వరగా జీర్ణమవడానికి ఈ టీ చక్కని పరిష్కారం. అంతేకాదు, ఒత్తిడిని తగ్గించడంలో, రక్తంలో చక్కెరలో స్థాయి ఆకస్మిక పెరుగుదల, తగ్గుదలలను నియంత్రించడంలో సహాయ పడుతుంది. అతిగా తిన్న తర్వాత లవంగం టీ ఎందుకు తాగాలి అనే కారణాలను తెలుసుకుందాం…
జీర్ణక్రియ మెరుగుదలకు..
లవంగం టీ దాని జీర్ణ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. లవంగాలలోని సహజ సమ్మేళనాలతో కలిపి, ఈ వేడి టీ జీర్ణక్రియలో సహాయపడుతుంది. లవంగంలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దీనిని ఎఫెక్టివ్ ఫ్రెషనర్‌గా చేస్తాయి. లవంగం టీని సిప్ చేయడం ద్వారా భోజనం తర్వాత నోటి దుర్వాసనను నిలువరించేందుకు సహాయపడుతుంది, తద్వారా మీరు తక్షణమే రిఫ్రెష్ అవ్వవచ్చు.
వాపును తగ్గిస్తుంది
లవంగాలలో యాంటీ ఇన్‌ఫ్ల్లమేటరీ సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి జీర్ణవ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ సున్నితమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం రిచ్ లేదా స్పైసీ ఫుడ్స్ తీసుకున్న తర్వాత ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది
అధ్యయనాల ప్రకారం, లవంగాలను నమలడం వల్ల మెరుగైన ఇన్సులిన్ స్థాయిలను అందిస్తుంది. రక్తప్రవాహంలోకి నిరంతరం శక్తిని విడుదల చేస్తుంది, తద్వారా రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ టీ వాసన ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కలిగించే ప్రయోజనకరమైన లక్షణాలను కలిగి ఉంటుంది. చాలా ఒత్తిడికి గురైనప్పుడు లవంగం టీ తాగడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది లవంగాలలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. భోజనం తర్వాత లవంగం టీ తాగడం వల్ల అవసరమైన పోషకాలు అందుతాయి. ఇవి ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి.