రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి

– నేడు ప్రపంచ రక్త దాతల దినోత్సవం
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న పెద్దల మాటలను కుమార్ అక్షర సత్యం చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ సామాజిక సేవ కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామానికి చెందిన గాలిపెల్లి కుమార్ ఇప్పటి వరకు 48 సార్లు రక్తదానం చేశారు.150 మందికి పైగా కోవిడ్ వాళ్లకు ప్లాస్మా అందించి ప్రాణాలు కాపాడారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రాణాపాయ స్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న అనేక మందికి రక్త దానం చేస్తూ చేయిస్తూ తన మిత్రులతో తోటి వారితో చేయిస్తూ ఎందరో ప్రాణాలు నిలుపుతున్నాడు. ఫోన్ చాలు చేస్తే ఎక్కడ ఉన్నా రక్త దానం చేస్తూ చేయిస్తూ ఇప్పటి వరకు ఆరు వేలమందికి పైగా ప్రాణాలు కాపాడాడు. రక్త దాన చేతన్య యుద్ధం లో నేను సైతం అంటూ ప్రతి ఇంటిలో రక్త దాతను తయారు చేసే లక్షంగా ముందుకు సాగుతున్నాడు. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా 159 మందికి ఉచితంగా ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడారు.