నవతెలంగాణ-తలకొండపల్లి
మండల పరిధిలోని కోరంతకుంట తండా గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంటి నిర్మాణంలో భాగంగా నిరుపేద కుటుంబమైన రామావత్ వాల్య నాయక్ ఇంటి నిర్మాణం కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జడ్పీిటీసీ ఉప్పల వెంకటేష్ తన ట్రస్టు ద్వారా స్టీలు, సిమెంట్‌ను అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన వాల్య ఉప్పల వెంకటేష్ స్థానిక మండల వైస్ ఎంపీపీ మ్యాక శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గట్టు ఇప్పలపల్లి మాజీ సర్పంచ్ మైసయ్య, బాపురెడ్డి, నరసింహ నాయక్, తిరుపతి రెడ్డి, కోరింతకుంట తండ ప్రజలు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖానాపూర్ గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి ఇండ్ల నిర్మాణం అసంపూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగా నిరుపేద కుటుంబాలకు చెందిన మంగలి యాదయ్య, పేరుమల చందన, ఇంటి ఫినిషింగ్ కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పీటీసీ వెంకటేష్ తన ట్రస్ట్ ద్వారా సిమెంట్‌ను అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన మంగలి యాదయ్య, పేరుమల చందన కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఖానాపూర్ సర్పంచ్ బి వెంకటరామిరెడ్డి, ఉప సర్పంచ్ రవి, సింగల్ విండో డైరెక్టర్ యాదయ్య గౌడ్, శ్రీనివాస్, శివాజీ, అంజయ్య, గణేష్, పాండు తదితరులు పాల్గొన్నారు.