అసంతృప్తి వద్దు

అసంతృప్తి వద్దుప్రతిఒక్కరి జీవితంలో టీనేజ్‌ దశ ఎంతో కీలకమైంది. ఈ దశలోనే ఎన్నో రకాల ఆకర్షణలు కలుగుతాయి. శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఇవి ప్రతి ఒక్కరిలో సర్వసాధారణం. అయితే, కొంత మంది టీనేజర్లు తమ శరీరంలో వస్తున్న మార్పులపై నెగెటివ్‌గా ఆలోచిస్తూ, ఇతరులతో పోల్చుకుంటూ ఆందోళన చెందుతుంటారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇది క్రమంగా వారి మానసిక ఆరోగ్యానికి ముప్పు తెస్తుందట. ఈ అధ్యయన ఫలితాలు ఎపిడెమియాలజీ కమ్యూనిటీ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
యూకేలో టీనేజీర్లపై చేసిన ఈ సర్వేలో 61 శాతం మంది తమ శరీరంపై అసంతప్తితో ఉన్నారని తేలింది. వారి శరీరం పట్ల అసంతప్తికి ప్రమాదకర ఆరోగ్య ప్రవర్తనలు, మానసిక ఆందోళనలు వంటివి ప్రధాన కారణాలుగా అధ్యయన రచ యితలు పేర్కొన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వారందరూ 14 సంవత్సరాల వయసు ఉన్న వారే. ఇందులో భాగంగా వారి బరువు, ఫిగర్‌, బాడీ బిల్డ్‌ లేదా రొమ్ములు, కడుపు, నడుము, తొడలు, పళ్లు, కాళ్ళు, ముఖం, జుట్టు వంటి భాగాలపై ఐదు పాయింట్లలో అభిప్రాయా లను సేకరించారు. ఆసక్తికర విషయమేమంటే, అబ్బాయిలకంటే అమ్మాయిలే తమ శరీరంపై ఎక్కువ అసంతప్తితో ఉన్నారని తేలింది. తమ తొడలు, కడుపు, బరువు పట్ల ఎక్కువ అసంతప్తితో ఉన్నారని సర్వేలో వెల్లడైంది. అయితే అమ్మాయిలు తమ జుట్టు, పళ్లతో సంతప్తికరంగా ఉన్నామని చెప్పగా, అబ్బాయిలు మాత్రం కడుపు, పళ్ల భాగాలపై ఎక్కువ అసంతప్తితో ఉన్నారని పేర్కొన్నారు.
బరువుపైనే ఎక్కువ అసంతప్తి.. : సర్వేలో 32 శాతం మంది అమ్మాయిలు, 14 శాతం మంది అబ్బాయిలు వారి బరువుపై ఎక్కువ అసంతప్తితో ఉన్నారట. ”వారు టీనేజీలో ఉండాల్సిన బరువుకు మించి ఎక్కువ బరువు ఉండటం వల్ల వారిలో ఆందోళన అధికంగా ఉంది” అని అధ్యయనం మొదటి రచయిత అభిప్రాయపడ్డారు. అయితే టీనేజీ యువకులు సాధారణంగా సన్నగా ఉండటానికి ఇష్టపడరని, వారు బలమైన ఖండలను కలిగి ఉండాలని కోరుకుంటారని చెప్పారు. అయితే ఈ అసంతప్తి నుంచి బయటపడటానికి కొన్ని ఆలోచనలు మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే…
ఇతరులతో పోలిక.. : చాలా మంది తమను తాము ఇతరులతో పోల్చుకొని బాధపడుతుంటారు. ఈ ధోరణి ముఖ్యంగా అమ్మాయిల్లోతో కన్పిస్తుంది. సినిమాల్లో నటీనటులు ఉన్న విధంగా తమ శరీర ఆకతి లేదని ఆందోళన చెందుతుంటారు. ఈ ధోరణి మంచిది కాదని నిపుణులు అంటున్నారు.
పాజిటివ్‌గా ఆలోచనలు.. : ఎవరెలా ఉన్నా, వారు వారి శరీరాలను ముందుగా ప్రేమించుకోవాలి. అప్పుడే నెగిటివ్‌ ఆలోచనలను పక్కకు పోతాయి. ఎలాంటి అసంతృప్తి ఉండదు.
నచ్చిన దుస్తులు : నచ్చిన బట్టలను, శరీరానికి అనుకూలంగా ఉండే వాటిని ధరించాలి. ఇలా చేయడం వల్ల శరీరం పట్ల ఇష్టం పెరుగుతుంది.
ప్రతికూల ఆలోచనలు : మనసులోకి ఏదొక సందర్భంలో ప్రతికూల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వాటి గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటే మరింత కుంగిపోతారు. అందుకే అలాంటి ఆలోచననలు మీలో కలిగినప్పుడు వాటికి అక్కడే ఫుల్‌స్టాప్‌ పెట్టేయాలి.
సోషల్‌ మీడియా వాడకాన్ని తగ్గించాలి : ప్రస్తుతం సోషల్‌ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఎక్స్‌ వంటివి లేకుండా ఒక్క గంట గడపడం కష్టంగా మారిపోయింది. అయితే సోషల్‌ మీడియాలో చూసే ప్రతిదీ నిజం కాదని ముందుగా గమనించాలి. వాటిలో ఇతరులు పోస్ట్‌ చేసే ఫోటోలను చూసి పోలిక పెట్టుకోవడంతోనే సమస్య మొదలవుతుంది. మనసు పాడవడం తప్ప ఏమీ ఉండదు. కాబట్టి వీలైనంత వరకు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి.
ఆహారంపై నియంత్రణ : సాధారణంగా టీనేజ్‌లో ఫాస్ట్‌ఫుడ్స్‌ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అది అనారోగ్యకరం. చెడు ఆహారపు అలవాట్లకు దూరంగా ఉంటూ, ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి ప్రాధానత ఇస్తుంటే… శరీరాన్ని మీకు నచ్చినట్టు తీర్చిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది.