– బీఆర్‌ఎస్ సత్తుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య
నవతెలంగాణ-తల్లాడ
ఎన్నికలప్పుడే వచ్చి మాయ మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్‌ఎస్ సత్తుపల్లి నియోగజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఆదివారం తల్లాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సండ్ర మాట్లాడారు. నిత్యం ప్రజలతో మమేకమై ఒక కార్యకర్తలా పనిచేసిన నన్ను ప్రజలే గుర్తిస్తారన్నారు. నా బలగం బలం మీరేనన్నారు. గత మూడు పర్యాయాలుగా నన్ను గెలిపించి ఆదరించారు. అదేవిధంగా ఈ నెల 30న జరిగే ఎన్నికలలో అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తల్లాడ మండలంలో అనేక అభివృద్ధి పనులతో రోడ్లు, వంతెనలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించామని, అభివృద్ధిని చూసి నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డి.శ్రీనివాసరావు, వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ డి.భద్రరాజు, రెడ్డి వీర మోహన్‌రెడ్డి, వెంకట్ లాల్, బొడ్డు వెంకటేశ్వరరావు, మోదుగు ఆశీర్వాదం, దగ్గుల శ్రీనివాసరెడ్డి, బద్దం కోటిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు జివిఆర్, కో ఆప్షన్స్ సభ్యుడు షేక్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.