– ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
– జీహెచ్‌ఎంసీ శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్‌ను కలిసిన ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ-మియాపూర్
అభివృద్ధి పనుల్లో ఎక్కడా రాజీపడొద్దని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సమక్షంలో మంగళ వారం కార్పొరేటర్లు మంజులరెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్‌తో మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధి లోని జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, స్థితి గతుల పై చర్చించినట్టు తెలిపారు. పెండింగ్ పను లు త్వరిత గతిన పూర్తి అయ్యేలా చూడలని, కొత్త ప్రతిపాదనలు తీసుకురావాలని సూచించారు. కొత్త ప్రతిపాదనలకు నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుని, వర్షా కాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అధికారులందరినీ అప్రమత్తంగా ఉండేలా చూడలని ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు. చెరువుల సుందరీకరణ పనులు వేగ వంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికా రులందరూ సమన్వయంతో పనిచేయాలని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండలని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఇ శ్రీనివాస్, చందానగర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.