అమ్ముడు పోయే అభ్యర్థిని నమ్మొద్దు

– అద్దె అభ్యర్థిని ఓడించండి
– సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించండి
– జోరందుకున్న సీపీఐ(ఎం) ప్రచారం
– త్రిముఖ పోటీ అంటున్న రాజకీయ విశ్లేషకులు
నవతెలంగాణ-చర్ల
మాయమాటలు చెప్పి ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఇతర పార్టీలకు అమ్ముడుపోయే, ఎక్కడినుండో అద్దెకు తెచ్చిన అద్దె అభ్యర్థులను నమ్మొద్దని సీపీఐ(ఎం) బలపరిచిన కారం పుల్లయ్యనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఎలమంచిలి రవికుమార్‌ అన్నారు. మన నియోజకవర్గంలో పుట్టి పెరిగి కుంజా బుజ్జి, సున్నం రాజయ్య వారసత్వం తీసుకొని దుమ్ముగూడెం మండలం వాసి నిరంతర పోరాట యోధుడు కారం పుల్లయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సుమారు 23 సంవత్సరాల నుండి ప్రజా సమస్యలపై పోరాడుతూ నిత్యం ప్రజల్లో ఉండే ఆదర్శవంతమైన నాయకుడు కారం పుల్లయ్య అని వారు కీర్తించారు.
జోరందుకున్న సీపీఐ(ఎం) ప్రచారం
ప్రజాదారణ పొందిన సీపీఐ(ఎం) ప్రచారం రోజురోజుకు ఊపందుకుంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రచారంలో కొంత ఆలస్యమైనప్పటికిని ప్రచారం ప్రారంభించిన వారం రోజుల్లోనే పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం ప్రారంభమైందని అనుకోవచ్చు. ముఖ్య నాయకులను కలుస్తూ పార్టీ శ్రేణులు రాత్రి పగలు అని తేడా లేకుండా శ్రమిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఆది నుండి జన బలం ఉన్న పార్టీకి గెలుపు తద్యమని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆ మార్పులో ఈసారి భద్రాచలం గడ్డపై ఎర్రజెండా తప్పకుండా ఎగురుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు త్రిముఖ పోటీగా రాజకీయం చర్ల మండలంతో సహా భద్రాచలం డివిజన్లోనే నడుస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆదివారం సీపీఐ(ఎం) నాయకులు మండల కేంద్రంలో పలువురు ప్రముఖులను కలవడంతోపాటు ఆదివారం సంతలో ప్రచార జోరుగా సాగింది. ఆయా కార్యక్రమాల్లో మండల కార్యదర్శి కారం నరేష్‌, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి. మధు, జిల్లా నాయకులు కే. బ్రహ్మచారి, రేపాకుల శ్రీనివాస్‌, మండల నాయకులు మచ్చ రామారావు, పి. సమ్మక్క, పి. బాలాజీ, దొడ్డిహరి నాగ వర్మ, బి. చంటి, తాటి నాగమణి, సత్రపల్లి సాంబశివరావు, కోరం కాంతారావు, సారోని వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.