కాఫీ..
ఈ రోజుల్లో 95 శాతం ఆపరేషన్ ద్వారానే డెలివరీలు అవుతున్నాయి. అటువంటి వారికి ఒక వారం పదిహేను రోజులు కాఫీ తాగమని హాస్పిటల్ సిబ్బంది సలహా ఇస్తుంటారు. కుట్లు మానేందుకు ఇది సహకరిస్తుందని వారి సూచన. ఆ కొద్ది రోజులు తీసుకుంటున్నారు కూడా. చాలా మందికి ఉదయం, సాయంత్రం కాఫీ తీసుకో వడం అలవాటుగా ఉంటుంది. పాలిచ్చే తల్లులు ఒకటి, రెండు సార్లు కాఫీ తాగొచ్చు. అంతకు మించి తాగొద్దు. దీని వల్ల అజీర్ణ సమస్యలు వస్తాయి. కాఫీలోని కెఫిన్ కంటెంట్ పెద్దవారికి జీర్ణమవుతుంది. కానీ, పాల రూపంలో శిశువు లోకి వెళ్ళగానే వారు ఆ పాలని జీర్ణించుకోలేరు. కాలక్రమేణా పెద్ద మొత్తంలో కెఫిన్ మీ చిన్నారుల వ్యవస్థలో పేరుకుపోతుంది. ఈ కారణంగా వారికి చికాకు, నిద్రకు భంగం ఏర్పడుతుంది.
పచ్చి కూరగాయలు
ఆరోగ్యం కోసం అని కొద్దిమంది క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ వంటి పచ్చి కూరగాయలను అల్పాహారంలో చేర్చుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల తల్లి ప్రేగులో గ్యాస్ ఏర్పడే ప్రమాదం ఉంది. దీని కారణంగా తల్లికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది.
హై మెర్కూరీ చేపలు..
హై మెర్క్యూరీ కంటెంట్ శిశువు కేంద్ర నాడీ వ్యవస్థను శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది. బిగ్ ఐ ట్యూనా, కింగ్ మాకెరెల్, మార్లిన్ ఫిష్‌లలో మెర్క్యూరీ ఎక్కువగా ఉంటుంది, ఇది విష పూరితమైన లోహం. చిన్నారులకు ఇది హాని చేస్తుంది. దీని కారణంగా వారు బలహీనంగా మారే ప్రమాదం ఉంది.
ఆల్కహాల్..
పాలిచ్చే తల్లలు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది పాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఆల్కహాల్ తాగడం వల్ల పిల్లలు పాలు తాగడం 20 నుంచి 23 శాతం తగ్గుతుంది. పాపాయి నిద్ర భంగం, చికాకు కలుగుతుంది.
చాక్లెట్స్…
చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్లు, కూల్‌డ్రింక్స్ తీసుకోవడం సర్వసాధారణమైన అంశం. అయితే వీటిని బాగా తగ్గించాలి. వీటిలో ఉండే కెఫీన్, చక్కెరలు తల్లుల్లో పాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. అలాగే పిల్లలు తల్లిపాలు తాగడం వల్ల వారికీ దగ్గు, జలుబు, జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి పిల్లలకు పాలివ్వడం ఆపే వరకు తల్లులు ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది.