డబుల్‌ ధమాకా..

డబుల్‌ ధమాకా..విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమాతో పాన్‌ ఇండియా వైడ్‌గా సందడి చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ న్యూజిలాండ్‌లో శరవేగంగా జరుగుతోంది. డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కావడంతో ఈ సినిమాను ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మోహన్‌ లాల్‌, శివ రాజ్‌ కుమార్‌, ప్రభాస్‌, శరత్‌ కుమార్‌ వంటి స్టార్లు ఇందులో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు (గురువారం) విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్‌ రానుందని చిత్ర బృందం తెలిపింది.
ఇదిలా ఉంటే, నేటితో మోహన్‌బాబు సినీ ప్రయాణానికి 48 ఏండ్లు పూర్తయ్యాయి. విలక్షణ నటుడిగా, కలెక్షన్‌ కింగ్‌గా మోహన్‌ బాబు ఈ 48 ఏండ్లలో ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్రను వేశారు. జయాపజయాలకు అతీతంగా ఆయన కొనసాగించిన ప్రయాణం అన్ని తరాల వారికి స్ఫూర్తిదాయకం.